Bosch: ముంబయి జట్టుకు బోష్ మారడంపై పీసీబీ ఫైర్..! 1 y ago
ముంబయి ఇండియన్స్ ఆల్ రౌండర్ కార్బిన్ బోష్ కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తాజాగా లీగల్ నోటీసులు జారీ చేసింది. ముందుగా పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడేందుకు అంగీకరించి, హఠాత్తుగా IPL లో MIతో ఒప్పందం చేసుకోవడమే అందుకు కారణమని తెలిపింది. కాగా దక్షిణాఫ్రికాకు చెందిన బోష్ ఈ ఏడాది పాకిస్థాన్ మీదే తన అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ సిరీస్ లో సత్తా చాటడం వల్ల బోష్ ని PSL ఫ్రాంఛైజీ పెషావర్ జల్మి తమ జట్టులోకి తీసుకుంది. బోష్ ముందు పీఎస్ఎల్ ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకుని, ఇప్పుడు ముంబయి జట్టుకు మారడంపై పీసీబీ ఫైర్ అయ్యింది.